కొత్తపెళ్ళి కూతురనీ కూసింత ఇదిలేదా పాట లిరిక్స్ | నిండు దంపతులు (1971)

 చిత్రం : నిండు దంపతులు (1971)

సంగీతం : టి.వి.రాజు

రచన : సినారె

గానం : ఎల్.ఆర్.ఈశ్వరి


కొత్తపెళ్ళి కూతురనీ

కూసింత ఇదిలేదా

హవ్వ.. మరియాదా..

సందె వాలేదాకా

సద్దు మణిగేదాకా

సంభాళించుకోలేవా ఓ మావ

తమాయించుకోలేవా ఓ మావ


వల్లమాలిన పిల్లగాలి

ఒళ్ళు నిమిరే దాకా

సిగలోని సన్నజాజులు

సిగ్గు యిడిచే దాకా

కన్నెవయసూ నిన్ను చేరి

కన్ను గీటే దాకా


సంభాళించుకోలేవా ఓ మావ

తమాయించుకోలేవా ఓ మావ


కొత్తపెళ్ళి కూతురనీ

కూసింత ఇదిలేదా

హవ్వ.. మరియాదా..

 

పట్టలేని బేలమనసు

పట్టుదప్పిన ఏళ

పొంగి పొరలు దోరవలపు

పురులు యిప్పిన యే

జంట గోరిన కొంటె కోరిక

పంటకెదిగిన యేళ

సంభాళించుకోలేను ఓమావా

సైపలేకున్నాను ఓ మావా


కొత్తపెళ్ళి కూతురనీ

కూసింత ఇదిలేదా

హవ్వ.. మరియాదా..

సందె వాలేదాకా

సద్దు మణిగేదాకా

సంభాళించుకోలేనూ ఓ మావ

తమాయించుకోలేనూ ఓ మావ 

Share This :



sentiment_satisfied Emoticon