ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
పొదుగు కిందా కడవలుంచిన
పొంగి పొరలగ పాలు ఇచ్చిన
అందమైనా బలము గల్గిన
ఆలమందల ఆస్తి పొందిన
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
రాజ్యమెంతయి కలిగినోడా
అప్రమత్తుగా ఉండువాడా
లోకమందున జన్మనెత్తిన
జ్యోతిరూపా నిదురలెమ్ము
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
శత్రువులు నీ శక్తినీ గని
శరణమొసగెడి వాడవీవని
చరణపద్మములాశ్రయించిన
చందమున మేమొచ్చినామురా
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
నిన్ను వీడి వుండలేమని
అన్నియు వదిలేసి పదముల
ఆశ్రయించి స్తుతిని సల్పుతు
మంగళమ్ము పాడుచుందుము
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon