చిత్రం : లైలా మజ్ను (2007)
సంగీతం : ఎమ్.ఎమ్.శ్రీలేఖా
సాహిత్యం : వేటూరి
గానం : వేణు, గంగ, రమణ, స్రుజన
మల్లెల్ని మాలకట్టి వేశారు అచ్చచ్చో
మందార బుగ్గ గిచ్చచ్చో
అందాల బొమ్మ మనువాడే
సీతమ్మను రామయ్య నచ్చచ్చో
కళ్యాణ తిలకం దిద్దేచ్చో..
పదహారణాల పడుచు వన్నెలు
పదిలంగానే దాచుకున్న
ఈ పెళ్ళికూతురు సిగ్గు చిలకరయ్యో
నవనవలాడే నవమన్మధుడే
మిల మిల మెరిసే మగమహరాజు
చుక్కపెట్టినా చందమామరయ్యో
మహ ముద్దు ముద్దుగుందీ
కనువిందు చేసెనెండీ
ఇది పెళ్ళి పందిరండీ
అనురాగం పలికిన వేడుకలండీ
పదహారణాల పడుచు వన్నెలు
పదిలంగానే దాచుకున్న
ఈ పెళ్ళికూతురు సిగ్గు చిలకరయ్యో
యవ్వనాల ఏరువాకలో
వెన్నపూస రాసలీలలు
కన్నెమనసు కాజేస్తావా కొంటె కృష్ణుడా
చందనాల చూపు రువ్వుతూ
బంధనాల మాలలల్లుతూ
చల్ల ముంత దాచేస్తావా తీపి గోపికా
నల్లనయ్య నీ వేషాలూ
చెల్లవయ్య నీ మోసాలు
మంత్రమేసె నీ మాయ చాలు మురారి
తెచ్చుకున్న ఈ రోషాలు
తెలుసుకున్నవే పాఠాలు
తెల్లవారితే చీకటల్లె పరారీ
తలుపే తెరిచా నిను కోరి
ముత్యమంటి వన్నె చిన్నెలూ
ముద్దబంతి మూతి ముడుపులు
మూగమనసు సైగలు ఊగే రాగడోలికా
మేలుకోని మౌన వీణని
మీటలేవు కుర్ర ఊహలూ
ఆశపడిన ఆరాటాలా తీగలాగకా
అల్లరెందుకే అమ్మాయి
పుల్ల విరుపులే మానేయి
పిల్లగాలి మోగించనీ సన్నాయి
మెల్ల మెల్లగా అబ్బాయి
ముద్దు ముద్దుకీ కొత్తోయి
ముగ్గులోకి నను దించలేవు పోవోయి
చిలకే చెబితే వినవోయి..
పదహారణాల పడుచు వన్నెలు
పదిలంగానే దాచుకున్న
ఈ పెళ్ళికూతురు సిగ్గు చిలకరయ్యో
నవనవలాడే నవమన్మధుడే
మిల మిల మెరిసే మగమహరాజు
చుక్కపెట్టినా చందమామరయ్యో
మహ ముద్దు ముద్దుగుందీ
కనువిందు చేసెనెండీ
ఇది పెళ్ళి పందిరండీ
అనురాగం పలికిన వేడుకలండీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon