నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : లీల
నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప
నా జీవిత తీరమున, నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును, నడిపించుము లోతునకు
నాయాత్మ విరబూయ, నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము, నా సేవ జేకొనుము
నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప
రాత్రంతయు శ్రమపడినా, రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను, రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ, రమణీయ లోతులలో
రాతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవ
నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప
ఆత్మార్పణ చేయకయే, ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే, అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే, ఆవేదనేదురాయే
ఆధ్యాత్మిక లేమిగని, అల్లాడే నా వలలు
నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon