మలినశూన్యములైన మణులెన్నో పొదిగిన పాట లిరిక్స్ | తిరుప్పావై గీతగోపాలం

 ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం

సంగీతం : వి.డి.శ్రీకాంత్

సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య

గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


మలినశూన్యములైన మణులెన్నో పొదిగిన

వలపులను పురికొల్పు గంధములు చల్లిన

పలు విధములైన దీపాల వెలుగున

పులకరించెను శయ్య పుష్ప సంపదలతో


మత్తుకొల్పెడి క్రొత్త మేడలో పడుకొన్నా

అత్త కూతురా వేగ లేచి ఇటు రావమ్మా

చిత్త శుద్దితో తలుపు శీఘ్రమే తీయమ్మా

పెత్తనం చాలించి మెత్తబడిపోవమ్మా


పుత్తడి మనసున్న పెద్ద అత్త గారు

మత్తొదిలి లేవనీ కూతురుని చూసేరు

చెవిటిదా గుడ్డిదా నీ బిడ్డ మూగదా

సేవలింకేమైనా చేసి అలసినదా


కదిలితే దండించు కాపరులు ఉన్నారా

కన్ను తెరవకుండా మంత్రించినారా

మాయావీ మాధవా వైకుంఠ వాసయని

మనసారా పిలవగా మగువ లేచిరమ్మా


మలినశూన్యములైన మణులెన్నో పొదిగిన

వలపులను పురికొల్పు గంధములు చల్లిన

పలు విధములైన దీపాల వెలుగున

పులకరించెను శయ్య పుష్ప సంపదలతో  


Share This :



sentiment_satisfied Emoticon