చిత్రం : టక్ జగదీష్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : శ్రేయ ఘోషల్, కాలభైరవ
ఇంకోసారి ఇంకోసారి
నీ పిలుపే నా ఎదలో చేరి
మళ్లోసారి మళ్లోసారి
పిలవాలంది నువు ప్రతిసారి
మనసుకే మొదలిదే మొదటి మాటల్లో
వయసుకే వరదిదే వలపు వానల్లో
కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో
తగదనీ తెలిసినా చివరి హద్దుల్లో
నా రాదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో
పున్నాగల పూచావేమో
ఎగరేసేయ్ ఊహల్నే
చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసేయ్ ఊహల్నే ఎగరేసేయ్ ఊహల్నే
చెరిపేసెయ్ హద్దుల్నే చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే చూసేద్దాం చుక్కల్నే
కవ్విస్తావు నీవు నీ కంటి బాణాలతో
గుండె అల్లాడేలా
నవ్విస్తావు నీవు నీ కొంటె కొణాలతో
చంటి పిల్లాడిలా
కన్నె ఈడు కోలాటమాడింది
కంటిపాపలో నిన్నే దాచింది
నిన్నలేని ఇబ్బంది బావుంది
నిన్నుకోరి రమ్మంటుందే
నా రాదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండెల్లో నా గుండెల్లో
పున్నాగల పూచావేమో
ఎగరేసేయ్ ఊహల్నే
చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసేయ్ ఊహల్నే ఎగరేసేయ్ ఊహల్నే
చెరిపేసెయ్ హద్దుల్నే చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే చూసేద్దాం చుక్కల్నే
ఇంకోసారి ఇంకోసారి
నీ పిలుపే నా ఎదలో చేరి
మళ్లోసారి మళ్లోసారి
పిలవాలంది నువు ప్రతిసారి
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon