చూపులే నా గుండె అంచుల్లో పాట లిరిక్స్ | వరుడు కావలెను (2021)

 చిత్రం : వరుడు కావలెను (2021)

సంగీతం : విశాల్ చంద్రశేఖర్    

సాహిత్యం : రాంబాబు గోసల  

గానం : సిధ్ శ్రీరామ్  


చూపులే నా గుండె అంచుల్లో

కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే

పువ్వులా నా ఊహల గుమ్మంలో

తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే

కొంచమైనా ఇష్టమేనా 

అడుగుతుందే మౌనంగా నా ఊపిరే

దూరమున్నా చేరువవుతూ

చెప్పుకుందే నాలోని ఈ తొందరే


కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా

నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా

కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా

కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా

మళ్ళి మళ్ళి రావే

పూల జల్లు తేవే


నువ్వెళ్ళే దారులలో

చిరుగాలికి పరిమళమే

అది నన్నే కమ్మేస్తూ ఉందే

నా కంటి రెప్పలలో

కునుకులకిక కలవరమే

ఇది నన్నే వేధిస్తూ ఉందే

నిశినలా విసురుతూ శశి నువ్వై మెరవగా

మనసులో పదనిసే ముసుగే తీసెనా

ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా

మన కదే మలుపులే కోరేనా


కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా

నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా

కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా

కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా

మళ్ళి మళ్ళి రావే

పూల జల్లు తేవే


చూపులే నా గుండె అంచుల్లో

కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే

నాన నానా నానా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్

నాన నానా నా నాన నానా నా

నాన నానా నానా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్

నాన నానా నా నాన నానా నా

మళ్ళి మళ్ళి రావే



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)