ధరణి మన్నించవే పాట లిరిక్స్ | ప్రైవేటు పాట

 


సంగీతం : ఫణికళ్యాణ్

సాహిత్యం : ఇమ్రాన్ శాస్త్రి

గానం : ఆదిత్య రావ్, సమీర భరధ్వాజ్


ఏదీ చివరికి మిగలదా

మన కథ సాగే మనుగడలో 

మట్టి గాలి చెట్టు నీరు

మట్టుపెట్టుకున్నామంటూ

అని ఇక మములను బలిగొనకా


మన్నించవే మన్నించవే

మాతల్లివే మన్నించవే..


ధరణి మన్నించవే

ధరణి మన్నించవే 

ధరణి మన్నించవే

ధరణి మన్నించవే 


కాపు గాసే నీడను

కాలదన్నుకుంటిమి

దాహమార్పు నీరుపై

నిప్పు జల్లుకుంటిమి

నీ గుండె తొలచి

గురుతే చెరిపేసితి

నిన్నే విడచి

ఏటో పయనించితి

శిధిలమై బ్రతుకిక

మరల శరణు అంటి


ధరణి  మన్నించవే

ధరణి మన్నించవే 

ధరణి  మన్నించవే

ధరణి మన్నించవే 


గా సగస నిసని

పనిపమ గమమా

గమపని మప

గా సగస నిసనిప గమమా

నిసగమప గమపనీ

గనిసస గనిసస గనిసస

నిసనిప నీపప నీపప

నీపప మపమమ

గమప నిని సగమద

సనిపమమా

గమప నిని సగమప

మమపా మమపా మమపా


మట్టి తోటి భందమే

మరచి పోయి ఉంటిని

ఉన్నదంత దోస్తూనే

నిన్ను వేరు చేస్తిని

మలినమే నా మనసూ

నీ విలువేం తెలుసూ


ప్రాణకోటి శ్వాసకు

నీవు కాదా కారణo

మానవ స్వార్థమే

చేసే వినాశనం

విలపించే నను

కానవ ఈ క్షణం

తెలిసొచ్చే ఇక

ఆపవ ఈ రణం


ధరణి  మన్నించవే

ధరణి మన్నించవే 

ధరణి  మన్నించవే

కరుణ చూపించవే 


కాపు గాసే నీడను

కాలదన్నుకుంటిమి

దాహమార్పు నీరుపై

నిప్పు జల్లుకుంటిమి

నీ గుండె తొలిచి

గురుతే చెరిపేసితి

నిన్నే విడచి

ఏటో పయనించితి

శిధిలమై బ్రతుకిక

మరల శరణు అంటి


ధరణి  మన్నించవే

ధరణి మన్నించవే 

ధరణి  మన్నించవే

కరుణ చూపించవే


Share This :



sentiment_satisfied Emoticon