చిత్రం : కృష్ణావతారం (1982)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
గానం : బాలు, సుశీల
సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు
సెరువంత చీకటిని సుక్కంత ఎలుగు
సుక్కంత ఎలుగేమొ సూరీడు గావాల
సిన్నారి సిరునవ్వు బతుకంత పండాల...
పువ్వులో పువ్వుంది బంగారు తల్లి
పువ్వులెంటే ముళ్ళు పొంచి ఉన్నాయి
మనసున్న మడిసొకడు ఈడనున్నాడు
కీడు రాకుండాను తోడుండగలడు
సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు
ఓ కంట కన్నీరు ఉరికేను చూడు
ఓ కంట పన్నీరు కురిసేను నేడు
కన్నతల్లి మనసు మురిపాలవెల్లి
కళ్ళలో మెరిసేను అనురాగవల్లి...
ఒంటిపైన లేని మనసంతవోయి
ఒడిలోని పాపాయి వటపత్ర శాయి
హాయి.. హాయి.. హాయి..ఆపదలూ గాయీ
హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి
హాయి ..హాయి.. హాయి.. ఆపదలూగాయీ
హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి
హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి
అత్తరూ లేదురా పన్నీరు లేదు
ఉడుకు నీరే చాలు మనకూ పదివేలు
సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ
నీ అగులు సుక్క సోగసు అద్దానికీసు
కన్నతల్లికి కంటి పాపవే గాని
కడమాళ్లకే కంటి నలుసు వయ్యావు
నేలపై పారాడు బాల కిట్టమ్మా
నెమలీకన్నేదిరా నాకు సూపమ్మా
నేలాపై పారాడు బాలా కిట్టమ్మా
నెమలీకన్నేదిరా నాకూ సూపమ్మా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon