చిత్రం : పేరెంట్స్ (2012)
సంగీతం : ఎస్.కె.బాలచంద్రన్
సాహిత్యం : వనమాలి
గానం : జై స్వప్న
జోజో లాలి జోలాలిజో
జోజో లాలి జోలాలిజో
రారానాన్నా నా ఒడికీ
రూపం నేనే నీ కలకీ
విడిచే శ్వాసతో కలిసే పాశమే
కనులే కరిగే ఈ క్షణమే
ఎదనే తొలిచే నీ రుణమే
జోజో లాలి జోలాలిజో
జోజో లాలి జోలాలిజో
రారానాన్నా నా ఒడికీ
రూపం నేనే నీ కలకీ
నిను చూసే నిముషంలో నిన్నల్లుకోదా
మది నీతో ప్రతి హాయి పంచేసుకోదా
ప్రేమ మీరగా అమ్మా అన్నమాటనే
విన్నవెంటనే నీకే చేరువవ్వదా
విడిచే శ్వాసతో కలిసే పాశమే
కనులే కరిగే ఈ క్షణమే
ఎదనే తొలిచే నీ రుణమే
జోజో లాలి జోలాలిజో
జోజో లాలి జోలాలిజో
రారానాన్నా నా ఒడికీ
రూపం నేనే నీ కలకీ
గానం : ఎస్.కె.బాల చంద్రన్
దాయి దాయి దాయమ్మనీ
నిన్నే చేరే దారిదని
నీకై రానీ నీవాడిని
ప్రాణం కోరే నీ ఒడినీ
గతమే చూపనీ నిజమే చూడనీ
జతగా కలిసే ఊపిరిలో
ఎప్పుడూ కనని ఊగిసలో
దాయి దాయి దాయమ్మనీ
నిన్నే చేరే దారిదనీ
నీకై రానీ నీవాడిని
ప్రాణం కోరే నీ ఒడినీ
ఒకసారి ఒడిలోన నీ జోలపాటే
వినుకుంటూ నిదురోనీ నా కంటిపానీ
చందమామనే చూస్తూ గోరుముద్దలే
ఆరగించనీ నీతో ఆశ తీరగా
గతమే చూపనీ నిజమే చూడనీ
జతగా కలిసే ఊపిరిలో
ఎప్పుడూ కనని ఊగిసలో
దాయి దాయి దాయమ్మనీ
నిన్నే చేరే దారిదనీ
నీకై రానీ నీవాడిని ప్రాణం కోరే నీ ఒడినీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon