కళ్యాణం గోదా కళ్యాణం పాట లిరిక్స్ | గోదాకళ్యాణం


చిత్రం : గోదాకళ్యాణం

సంగీతం : నాగరాజు తాళ్ళూరి

సాహిత్యం : వేదవ్యాస్/ఉదయభాస్కర్  

గానం : మాళవిక. మణి నాగరాజు


కళ్యాణం గోదా కళ్యాణం

వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం

కళ్యాణం గోదా కళ్యాణం

వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం


కలియుగమున కర్కట మాసమున

పుత్తడి పుబ్బా నక్షత్రమున

పుడమిని సీతా సతివలె తులసీ

వనమున విరిసిన వరాల తల్లీ


కళ్యాణం గోదా కళ్యాణం

వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం


ధనుర్మాసమున వ్రతమును చేసి

ధ్వయమంత్ర పాశురములు పాడీ

ముడిచిన విరులను ముకుందనికొసగీ

జతగా కూడిన జగదేక జననీ


కళ్యాణం గోదా కళ్యాణం

వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం


సచీదేవి తిలకమును దిద్దగా

సరస్వతి మణి బాసికము కట్టగా

పార్వతీ పారాణి పెట్టగా

వధువయీ వరలిన వసుధాదేవీ


కళ్యాణం గోదా కళ్యాణం

వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం


పరిమళ తైలము పూసీ శ్రీలక్ష్మీ

శ్రీహరీ కురులను దువ్వగా

మేళా దేవి కస్తూరి తిలకమును తీర్చగా

రంగడు వరుడై రంజిల్లు


కళ్యాణం గోదా కళ్యాణం

వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)