అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో పాట లిరిక్స్ | మిస్టర్ పెళ్ళాం (1993)

 చిత్రం : మిస్టర్ పెళ్ళాం (1993)

సంగీతం : కీరవాణి

సాహిత్యం : ఆరుద్ర 

గానం : బాలు, చిత్ర 


అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో

అలా అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో 

చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో

అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో 

చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో

ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో

ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో


పదునాలుగు భువనాలన్నీ 

పాలిస్తున్నాను పరిపాలిస్తున్నాను

ఆ భువనాలను దివనాలను 

నేను పోషిస్తున్నాను నేనే పోషిస్తున్నాను

సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి 

సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి

నేను అలిగి వెళ్ళానా తనకు లేదు టికానా


ఓహో ఏడు కొండలవాడి కథా తల్లీ 

నువు చెప్పేది బాగుందమ్మా కానీ కానీ


పెళ్లి కోసం తిప్పలు చేశాడండి అప్పులు

నాతో పెళ్లి కోసం తిప్పలు చేశాడండి అప్పులు


వడ్డీ కాసుల వాడా వెంకటరమణా గోవిందా గోవింద


కొండ మీద నేను మరి కొండ కింద ఎవరో 

నువ్వూ అడగవయ్యా

నడిరేయి దాటగానే దిగి వచ్చేదెవరో 

దిగి వచ్చేదెవరో


అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో 

చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో

ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో

ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో


త్రేతాయుగమున నేను 

ఆ శ్రీరామచంద్రుడిని

ఐనా సీతాపతి అనే పిలిచారండి 

మిమ్ము పిలిచారండి


నరకాసుర వధ చేసిన 

కృష్ణుడిని తెలుసా

సత్యభామని విల్లంబులు తెల్లంబుగ 

పట్టిన సత్యభామని వీరభామని


భామగారి నోరు భలే జోరు జోరు 

మొగుడిని దానమిచ్చినారు 

మొగసాలకెక్కినారు

ఆ తులాభారం అదో తలభారం 


భలే మంచి చౌక బేరము

సవతి చెంత కాళ్ళ బేరము

అయ్యా దొరగారి పరువు 

తులసీ దళం బరువు


సత్యం సత్యం పునః సత్యం

శ్రీ మద్ రమా రమణ గోవిందో హరిః 

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)