చిత్రం : మిథునం (2012)
సంగీతం : వీణాపాణి
సాహిత్యం : తనికెళ్ళ భరణి
గానం : బాలు, స్వప్న
ఆవకాయ మన అందరిది
గోంగుర పచ్చడి మనదేలే
ఆవకాయ మన అందరిది
గోంగుర పచ్చడి మనదేలే
ఎందుకు పిజ్జాల్ ఎందుకు బర్గర్
ఎందుకు పాస్తాలింకెందుకులే
ఎందుకు పిజ్జాల్ ఎందుకు బర్గర్
ఎందుకు పాస్తాలింకెందుకులే
ఆవకాయ మన అందరిది
గోంగుర పచ్చడి మనదేలే
ఇడ్డెన్లలోకి కొబ్బరి చెట్నీ
పెసరట్టులోకి అల్లమురా
ఇడ్డెన్లలోకి కొబ్బరి చెట్నీ
పెసరట్టులోకి అల్లమురా
దిబ్బరొట్టెకీ తేనె పానకం
దొరకకపోతె బెల్లము రా
దిబ్బరొట్టెకీ తేనె పానకం
దొరకకపోతె బెల్లము రా
వేడి పాయసం ఎప్పటికప్పుడె
పులిహోరెప్పుడు మర్నాడే
వేడి పాయసం ఎప్పటికప్పుడె
పులిహోరెప్పుడు మర్నాడే
మిర్చీ బజ్జీ నోరు కాలవలె
ఆవడ పెరుగున తేలవలే
ఆవకాయ మన అందరిది
గోంగుర పచ్చడి మనదేలే
గుత్తి వంకాయ కూర కలుపుకొని
పాతిక ముద్దలు పీకుము రా
గుత్తి వంకాయ కూర కలుపుకొని
పాతిక ముద్దలు పీకుము రా
గుమ్మడి కాయ పులుసుందంటే
ఆకులు సైతం నాకుమురా
పనస కాయ నీకున్న రోజునే
పెద్ధలు తద్దినమన్నారు
పనస కాయ నీకున్న రోజునే
పెద్ధలు తద్దినమన్నారు
పనస పొట్టులో ఆవ పెట్టుకొని
తరతరాలుగా తిన్నారు
తిండి గలిగితే కండ గలదనీ
గురుజాడ వారు అన్నారు
అప్పదాసు ఆ ముక్క పట్టుకొని
ముప్పూటలు తెగ తిన్నారూ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon