చిత్రం : సిసింద్రీ చిట్టిబాబు (1971)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
మల్లెలు పూచేవేళా
మనసులు పిలిచేవేళా
మల్లెలు పూచేవేళా
మనసులు పిలిచేవేళా
మళ్ళి మళ్ళి వస్తా..ఆ..ఆ..
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళి వస్తా
కనులైన కలవందే మనసైనా తెలవందే
ముద్దైనా ఇవ్వందే మోజైనా తీరందే
అలా జారుకొంటావే ఠలాయించిపోతావే
అలా జారుకొంటావే ఠలాయించిపోతావే
అయితే నేవెళ్ళొస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళొస్తా..వస్తా..
మళ్ళి ఎప్పుడైనా వస్తా
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
లగ్నం చూసుకు వస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా
చినదాని చెక్కిలిపై చిటికైనా వేయందే
కళ్ళల్లో కళ్ళుంచి కథలైనా చెప్పందే
అలా జారుకొంటావే ఠలాయించిపోతావే
అలా జారుకొంటావే ఠలాయించిపోతావే
అయితే నేవెళ్ళొస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళొస్తా..
వస్తా..ఎప్పుడన్నా వస్తా
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఎప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
లగ్గం చూసుకు వస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళొస్తా
వస్తా మళ్ళి వస్తా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon