ముందరున్న చిన్నదాని అందమేమో పాట లిరిక్స్ | కాలం మారింది (1972)

 చిత్రం : కాలం మారింది (1972)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : దాశరథి

గానం : ఘంటసాల, సుశీల


ముందరున్న చిన్నదాని అందమేమో

చందమామ సిగ్గు చెంది

సాగిపోయే... దాగిపోయే

ముందరున్న చిన్నదాని అందమేమో

చందమామ సిగ్గు చెంది

సాగిపోయే... దాగిపోయే


పొందుగోరు చిన్నవాని తొందరేమో

మూడుముళ్ళ మాట కూడ

మరచిపోయే... తోచదాయే


పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో

ఎందుకోసమో

పైట కొంగు కులికింది ఎవరికోసమో

ఎవరికోసమో

నీలోని పొంగులు నావేనని 

నీలోని పొంగులు నావేనని

చెమరించు నీ మేను తెలిపెలే

ఆ...ఆ..ఓ..ఓ...


పొందుగొరు చిన్నవాని తొందరేమో

మూడు ముళ్ళ మాట కూడ

మరచిపోయే... తోచదాయే


కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో

ఎందుకోసమో

కన్నెమనసు కాదంది ఎందుకోసమో

ఎందుకోసమో

సరియైన సమయం రాలేదులే

సరియైన సమయం రాలేదులే

మనువైన తొలిరేయి మనదిలే

ఓ..ఓ..ఆ..ఆ...


ముందరున్న చిన్నదాని అందమేమో

చందమామ సిగ్గు చెంది

సాగిపోయే... దాగిపోయే


ఎన్నాళ్ళు మనకీ దూరాలు

ఏనాడు తీరు ఈ విరహాలు

ఎన్నాళ్ళు మనకీ దూరాలు

ఏనాడు తీరు ఈ విరహాలు

కాదన్న వారు అవునన్ననాడు

కౌగిళ్ళ కరిగేది నిజములే


ముందరున్న చిన్నదాని అందమేమో...

చందమామ సిగ్గు చెంది

సాగిపోయే ...దాగిపోయే

పొందుగోరు చిన్నవాని తొందరేమో...

మూడుముళ్ళ మాటకూడ

మరచిపోయే... తోచదాయే

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)