చిత్రం : మల్లె పందిరి (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే..
తొలి చూపుతో 'రణ'మాయే ..
మ్.మ్.మ్మ్ రాముని తోక ..
సారీ నాకు అచ్చ తెలుగు అంతగా రాదు.. అంటే..
అంటే మిగతా భాషలలో పండితుడని కాదనుకొండి ...
తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే
తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
పగడాల పెదవులతోనే బిడియాలు కలబడుతుంటే
వగలమారి చెక్కిలి మీద పగటి చుక్క పకపకమంటే
శివమై అనుభవమై.. శుభమై సుందరమై
శివమై అనుభవమై.. శుభమై సుందరమై
కనుచూపు శుభలేఖలుగా
కనుచూపు శుభలేఖలుగా
కళ్యాణ రేఖలు మెరిసే...
తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే
తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
మనము పసుపు కుంకుమలై
మనువు గడప దాటుతువుంటే
కలిసి బొట్టు కాటుకలై కాపురాన అడుగిడుతుంటే
సిరిగా శ్రీహరిగా.. కలిసే లాహిరిలో...
సిరిగా శ్రీహరిగా.. కలిసే లా..హిరిలో...
నయనాలు ప్రియవచనాలై
నయనాలు ప్రియవచనాలై
అనురాగమే వినిపించే..
తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే
తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon