చిత్రం : జస్టిస్ చౌదరి (1982)
రచన : వేటూరి,
సంగీతం : చక్రవర్తి
గానం : బాలు, సుశీల, శైలజ
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని
పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు
అందాలకెందుకు గంధాల పూతలు
అందాలకెందుకు గంధాల పూతలు
కళ్లకే వెలుతురు మా పెళ్లికూతురు
ఈ పెళ్లికూతురు...
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని
అలుసు చేయవద్దు మీరు తానేమి అడగదని
ఆడగబోదు సిరిసంపదలు ఏనాడూ పెనిమిటిని
అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని
చెప్పలేని మూగబాధ చెప్పకనే తెలుసుకో
మాటలకే అందని మనసు..
చూపులతో తెలుసుకో..
రెప్పవలే కాచుకో..
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon