తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట పాట లిరిక్స్ | నిరీక్షణ (1981)

 చిత్రం : నిరీక్షణ (1981)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : ఆత్రేయ

గానం : బాలు, ఎస్.పి.శైలజ


తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట

చిన్నారి పొన్నారి చిలకల్ల జంట

చేస్తున్న కమ్మని కాపురమూ

చూస్తున్న కన్నుల సంబరమూ

ప్రేమకు మందిరమూ


తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట

చిన్నారి పొన్నారి చిలకల్ల జంట

చేస్తున్న కమ్మని కాపురమూ

చూస్తున్న కన్నుల సంబరమూ

ప్రేమకు మందిరమూ


తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట

చిన్నారి పొన్నారి చిలకల్ల జంట


ఒకదేహం ఒకప్రాణం తమ స్నేహంగా

సమభావం సమభాగం తమ పొందుగా

చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా

చెలికాని సరసాలే జంపాలగా

అనురాగం ఆనందం అందాలుగా

అందాల స్వప్నాలే స్వర్గాలుగా

ఎడబాసి మనలేనీ హృదయాలుగా

ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా

గూడల్లుకోగా పుల్లల్లుతేగా

చెలికాడు ఎటకో పోగా..

అయ్యో... పాపం..

వేచెను చిలకమ్మ


తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట

చిన్నారి పొన్నారి చిలకల్ల జంట


ఒక వేటగాడెందో వలపన్నగా

తిరుగాడు రాచిలుక గమనించక

వలలోన పడి తాను అల్లాడగా

చిలకమ్మ చెలికాని సడికానక

కన్నీరు మున్నీరై విలపించగా

ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా

ఎలుగెత్తి ప్రియురాలు రోదించగా

వినలేని ప్రియుడేమో తపియించగా

అడివంతా నాడు ఆజంట గోడు

వినలేక మూగైపోగా...

అయ్యో... పాపం...

వేచెను చిలకమ్మ


తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట

చిన్నారి పొన్నారి చిలకల్ల జంట

చేస్తున్న కమ్మని కాపురమూ

చూస్తున్న కన్నుల సంబరమూ

ప్రేమకు మందిరమూ


తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట

చిన్నారి పొన్నారి చిలకల్ల జంటా 

 

Share This :



sentiment_satisfied Emoticon