ఎన్నియల్లో పాట లిరిక్స్ | శివ (1989)

 చిత్రం : శివ (1989)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, చిత్ర


ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో

కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో


ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు

ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు

శృంగార వీణ రాగాలే... హోయ్!


ఎన్నియల్లో మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో

కవ్వింతల్లో తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో


సిగ్గేయగా.. బుగ్గ మొగ్గ.. మందార ధూళే దులిపే

జారేసినా.. పైటంచునా.. అబ్బాయి కళ్ళే నిలిచే


సందిళ్ళకే చలి వేస్తుంటే.. అందించవా సొగసంతా

ఒత్తిళ్ళతో ఒలిచేస్తోంటే.. వడ్డించనా వయసంతా


వెలుగులో కలబడే కళలు కన్నా

తనువులో తపనలే కదిపిన కధకళి లోనా


ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో

కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో


ఈ చీకటే.. ఓ చీరగా.. నా చాటు అందాలడిగే

ఈ దివ్వెలా.. క్రీనీడలే.. నీ సోకులన్నీ కడిగే


నీ మబ్బులే గుడి కడుతుంటే .. జాబిల్లిలా పడుకోనా

తబ్బిబుతో తడబడుతుంటే.. నీ గుండెలో నిదరోనా


ఉదయమే అరుణమై.. ఉరుముతున్నా

చెదరని నిదరలో.. కుదిరిన పడకలలోనా


ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో

కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో

ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు

ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు

శృంగార వీణ రాగాలే... హోయ్!


ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో

లలలల..లలలలలా.. 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)