తెలుసుకొనవె యువతి పాట లిరిక్స్ | మిస్సమ్మ (1955)

 చిత్రం : మిస్సమ్మ (1955)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : పింగళి 

గానం : ఏ. ఎం. రాజా


ఆఆఆఆ... ఆఆఆఅఆ... ఆఆఆఆఆ...


తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ

తెలుసుకొనవె యువతి


యువకుల శాసించుటకే..

యువకుల శాసించుటకే యువతులవతరించిరని


తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ

తెలుసుకొనవె యువతి


 

 

సాధింపులు బెదరింపులు.. ముదితలకిక కూడవనీ

ఆ.ఆఆఆఆఆఅ.అ. అఆఆఆఅ...

సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ

హృదయమిచ్చి పుచ్చుకొనే..

హృదయమిచ్చి పుచ్చుకొనే.. చదువేదో నేర్పాలని


తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ

తెలుసుకొనవె యువతి

 

మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ 

ఆ.ఆఆఆఆఆఅ.అ. అఆఆఆఅ...

మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ

మగువలెపుడు మగవారిని

మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని


తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ

తెలుసుకొనవె యువతి

Share This :



sentiment_satisfied Emoticon