శతమానం భవతి శతమానం భవతి పాట లిరిక్స్ | రాధాగోపాళం (2005)

 త్రం : రాధాగోపాళం (2005)

సంగీతం : మణిశర్మ

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : బాలు, చిత్ర


శతమానం భవతి శతమానం భవతి 

శతమానం భవతి

శతమానం భవతి నీకు శతమానం భవతి 

 

ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతి

శతమానం భవతి నీకు శతమానం భవతి

తనువులు రెండు తామొకటైన సీతారాములకి

శతమానం భవతి నీకు శతమానం భవతి

 

ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతి

శతమానం భవతి నీకు శతమానం భవతి

తనువులు రెండు తామొకటైన సీతారాములకి

శతమానం భవతి నీకు శతమానం భవతి


వేదం నాదంలా వెలుగూ దీపంలా

హారం దారంలా క్షీరం నీరంలా

మాటా అర్ధం రాగం భావం తూర్పు ఉదయంలా

పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా

ఆలుమగలు మొగుడు పెళ్ళాం భార్యా భర్తలకీ

శతమానం భవతి నీకు శతమానం భవతి


శతమానం భవతి శతమానం భవతి 

శతమానం భవతి శతమానం భవతి


తాళి కట్టే వేళ్ళు తడిమేటి వేళ

చాటు చూపులు సోకి సరసమాడే వేళ

పందెమేసే లేత అందాల బాల

తళుకులన్నీ తలంబ్రాలు పొసే వేళ

చేయి చేయి పట్టి చెంగు చెంగు కట్టి

ఏడు అడుగుల బాట నడిచేటి వేళ

తొలి కౌగిలింతలో పులకింత వేళ

ఆ వేళ ఈ వేళ ఆనంద వేళ

నూరేళ్ళకి నిత్య కల్యాణ హేల


శతమానం భవతి నీకు శతమానం భవతి

శతమానం భవతి నీకు శతమానం భవతి


Share This :



sentiment_satisfied Emoticon