మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే పాట లిరిక్స్ | ఆత్మీయులు (1969)

 


చిత్రం : ఆత్మీయులు (1969)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : దాశరధి

గానం : సుశీల


మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే


సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది

పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది


మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే


కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను

కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను

అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే


రాధలోని అనురాగమంతా మాధవునిదేలే

రాధలోని అనురాగమంతా మాధవునిదేలే

వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే


మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే


కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే


 

Share This :



sentiment_satisfied Emoticon