వినరా సోదర వీరకుమారా ఇంటర్నెట్టు గాథా పాట లిరిక్స్ | లేడీస్ & జెంటిల్మెన్

 చిత్రం : లేడీస్ & జెంటిల్మెన్ 

సంగీతం : రఘుకుంచే

సాహిత్యం : సిరాశ్రీ

గానం : రఘుకుంచే, బృందం


వినరా సోదర వీరకుమారా ఇంటర్నెట్టు గాథా.. 

తందాన తానా 

కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా.. 

తందాన తానా.. తరికిట ఝుంతరి తా..


అసలీ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే.. 

పావురాలతో కబురుపంపే కాలం దాటిపోయే..

తందాన తానా 

ఉత్తరాలతో వర్తమానాల రోజు చెల్లిపోయే.. 

తందాన తానా 

టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే... 

తందాన తానా

ఎస్టీడీ బూతులు కాయిను బాక్సులు కనుమరుగైపోయే 

తందాన తానా... తరికిట ఝుంతరి తా..


మరి ఇలాగైతే ఎలాగా ?

మనిషికి మనిషికి మధ్య సంబంధాలు తెగిపోవా.. 

మనసుకీ మనసుకీ మధ్య దూరం పెరిగిపోదా.. 


ఆ ముచ్చటా చెప్తాను వినవయ్యా.. 

సెల్ ఫోను చేతికొచ్చే.. భళి భళి 

సొల్లు ఊసులెన్నొ తెచ్చే.. భళి భళి 

మనిషి ఉన్న లోకం విడిచే.. హరి హరి 

కొత్తలోకంలోకి నడిచే.. హరి హరి

చుట్టూ ఉన్నవాటినన్ని వదిలి పెట్టి 

ఇంటర్నెట్టు లోకి నెట్టుకు పోయే... 


సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 

సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి  


ఫేసు బుక్కంటారు.. ట్విట్టరూ అంటారు.. 

వాట్సాపు అంటారు.. బిబిఎం అంటారు.. 

డ్రాప్ బాక్సు అంటారు.. జిడ్డూ అంటారు.. 

స్కైపులు అంటారు.. వైబరు అంటారు..

బాతు రూముల్లో బెడ్డు రూముల్లో 

ఆఫీసు రూముల్లో క్లాసు రూముల్లో.. 


ఎస్సెమ్మెస్ ఫ్లర్టింగూ.. హరి హరి.. 

పగలు రాత్రి ఛాటింగూ.. హరి హరి..  


సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 

సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 


ఇదంతా చెప్పావ్ బానే ఉందయ్యా.. వీటన్నిటి వల్ల ఉపయోగమేంటో ముందది చెప్పూ.... 


యాపిలంటే తినే పండేమి కాదు.. 

అరచేతిలోని చేస్తాది జాదూ.. ఓర్దీని తస్సాదియ్యా.. 

పంచె గట్టే ఓడు పెద్దరాయిడూ.. 

ప్రెపంచాన్నేలేది ఆండ్రాయిడూ.. 

హహహ భలే భలే.. 

సోషల్ నెట్వర్కూ చేతిలో ఉంటే 

ఎవడి డప్పు వాడే తందాన తానా..  ఆహా..ఆ

పెట్టిన పోస్టుకు లైకు రాకపోతే 

పరువు బోయినట్టు ఫీలవుతారన్నా.. 

జుట్టు ఊడినా..ఆఆఆ...

జుట్టు ఊడినా జబ్బు చేసినా..

గూగుల్ డాట్ కామ్ ఏ కొడుతున్నారన్నా..


ఇంటర్నెట్టు లోకమండీ.. భళి భళి 

ఇంటర్నెట్టు లోకమండీ.. భళి భళి 


మరింకేమయ్యా.. దీనివల్ల ప్రపంచమంతా మన కాళ్ళదగ్గరకొచ్చేసి మహా సౌకర్యంగా ఉంది కదా.. 

ఆఆఅ.. సౌకర్యంతో పాటు కూసింత కామెడీ కూడా ఉందయ్యా... 


చావుకబురైనా సినిమా కబురైనా పోటీలు పడుతూ అప్డేటులన్నా.. 

రిప్ లూ సినిమా రివ్యూలూనా.. 

వంటగదిలో చేసె ముచ్చట్లు అన్నీ పోస్టులు పెట్టి చంపుతారన్నా.. 

కాఫీలు పెట్టడం ఉప్మాలు చేయడం లాంటివా.. 

వెబ్ సైటుల్లో గాసిప్పులు చూసీ పన్లుమానేసి పంచాయితీలన్నా.. 

పెళ్ళిళ్ళూ అయినా పెటాకులైనా ఆన్ లైను లోనే అవుతున్నాయన్నా.. 

మరి సంసారం??.. 

దూరమున్నోళ్ళూ...ఓఓఓఓఓ..

దూరమున్నోళ్ళూ దగ్గరవుతున్నారు.. 

దగ్గరున్నోళ్ళూ దూరమవుతున్నారు.. 

 

సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 

సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 

సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 

సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 


ఐతే ఇంటర్నెట్టు వల్ల మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారనమాట.. 

అదేగదయ్యా.. ఎక్కడికెళ్తున్నారో తెలియక ఎటో వెళ్ళిపోతున్నారు..

తరికిట ఝుంతరి తా..

Share This :sentiment_satisfied Emoticon