సరిగమపదని స్వరధార పాట లిరిక్స్ | శ్రీవారికి ప్రేమలేఖ (1984)

చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం : రమేశ్ నాయుడు

సాహిత్యం : వేటూరి

గానం : బాలు   


తననం తననం తననం

గమప మపని దనిసా...

సనిదప సనిదప

దపగరి దపగరి

సనిద నిదప దపగ

పగరిస సా పా గరి సా

సా సా సా సా

రీ రీ రీ రీ

గా గా గా గా

పా పా పా పా


సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధృవతార

సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధృవతార

వీణవై... వేణువై... మువ్వవై... వర్ణమై...

గని దని గప గరి సరి స ని సా

వీణవై.. జాణవై.. వేణువై... వెలధివై

మువ్వవై.. ముదితవై.. వర్ణమై.. నా స్వర్ణమై

నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె


సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధృవతార

నెలవంక పల్లకిలొ ఇల్లవంక దిగిరావె

సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధృవతారా


అరుణం అరుణం ఒక చీరా... అంబరనీలం ఒక చీరా

అరుణం అరుణం ఒక చీరా... అంబరనీలం ఒక చీరా

మందారంలో మల్లికలా ఆకాశంలో చంద్రికలా

అందాలన్నీ అందియలై.. శృంగారంలో నీ లయలై

అందాలన్నీ అందియలై.. శృంగారంలో నీ లయలై

అలుముకున్న భూతావిలా.. అలవికాని పులకింతలా

హిందోళ రాగ గంధాలు నీకు ఆందోళికా సేవగా


ఆ....ఆ....ఆ....ఆ....

సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధృవతార

నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె

సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధృవతార


హరితం హరితం ఒక చీరా... హంసల వర్ణం ఒక చీరా

హరితం హరితం ఒక చీరా... హంసల వర్ణం ఒక చీరా

శాద్వరాన హిమదీపికలా.. శరద్వేళ అభిసారికలా

చరణాలన్నీ లాస్యాలై... నీ చరణానికి దాస్యాలై

అష్టపదుల ఆలాపనే... సప్తపదుల సల్లాపమై

పురివిప్పుకున్న పరువాల పైట సుదతినేవీవగా ఆ....


ఆ.....ఆ.....ఆ.....ఆ.....ఆ.....

సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధృవతార

నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె

సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధృవతారా..


 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)