ఓ పాపా లాలి జన్మకే లాలి పాట లిరిక్స్ | గీతాంజలి (1989)

చిత్రం : గీతాంజలి (1989)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు


ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తీయగా

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా

ఓ పాపా లాలి


నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా

నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక

కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో

తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో

చిరు చేపల కనుపాపలకిది నా మనవీ


ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తీయగా

ఓ పాపా లాలి


ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో

ఓ కోయిలా పాడవే నా పాటని తీయనీ తేనెలే చల్లిపో

ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో

సెలయేరుల అల పాటే వినిపించని గదిలో

చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ


ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తీయగా

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా

ఓ పాపా లాలి


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)