రంగు రంగుల పూలు పాట లిరిక్స్ | విచిత్రకుటుంబం (1969)

 చిత్రం : విచిత్రకుటుంబం (1969) 

సంగీతం : టి.వి.రాజు

రచన : సినారె

గానం : ఘంటసాల, సుశీల


రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలు

చల్లని బంగరు కిరణాలు.. మా చెల్లాయికి ఆభరణాలు

రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలు


వైశాఖమాసం వస్తుంది..ఎర్రని ఎండలు కాస్తుంది

శ్రావణమాసం వస్తుందీ..ఈ..

శ్రావణమాసం వస్తుందీ..చల్లని జల్లులు తెస్తుందీ

నిప్పులు చెరిగే అన్నయ్య కోపం..చప్పున చల్లారిపోతుందీ


రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు


తేలిపోయే మబ్బుల్లారా..నీలికలువల మాలికలారా

ఎవరు పంపిన దూతలు మీరు..ఈ..


ఎవరు పంపిన దూతలు మీరు..ఏ లోకాలకు వెళుతున్నారు

ఈడైన చెల్లికి జోడైన వరుని..జాడతెలుసుకొని వస్తారా


విలపించె ఓ మబ్బుల్లారా..వెల వెల బోయే మాలికలారా

కన్నీళ్ళు తుడిచే అన్నయ్యలేడని..కలవరపడుతున్నారా


బిల బిల ఎగిరే గువ్వల్లారా..ఇలపైకాస్తా దిగివస్తారా..

కనరండి మా తల్లి వదినమ్మనూ..

కలికాలాన వెలసిన సీతమ్మనూ

  

రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు

చల్లని బంగరు కిరణాలు..మా చెల్లాయికి ఆభరణాలు

రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు 

ఆహాహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహాహా..


Share This :



sentiment_satisfied Emoticon