చిత్రం : అదిగో అల్లదిగొ (1985)
సంగీతం : చంద్రశేఖర్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల(?)
ప్రేమలో తీయదనం ఉన్నది
అది ప్రేమించే వారికే తెలిసింది
సరె సరి
ప్రేమలో తీయదనం ఉన్నది
అది ప్రేమించే వారికే తెలిసింది
సరే సరి
తెలియనిది ఒకటుంది
త్యాగం ఎంత గొప్పదన్నది
తెలియనిది ఒకటుంది
త్యాగం ఎంత గొప్పదన్నది
సరే సరి
ప్రేమలో తీయదనం ఉన్నది
అది ప్రేమించే వారికే తెలిసింది
సరే సరి
ఇన్నాళ్ళు ఈ సిగ్గు ఏడ దాగి ఉన్నది
పానకాన పుడకలాగా ఇప్పుడొచ్చి పడ్డది
ఇన్నాళ్ళు ఈ సిగ్గు ఏడ దాగి ఉన్నది
పానకాన పుడకలాగా ఇప్పుడొచ్చి పడ్డది
సందెవేళ కురులలోన మొగ్గలా ఉన్నది
తెల్లవారి కౌగిలిలో పువ్వులా పూస్తుంది
అసలు మీద లేని మోజు వడ్డీపై ఉన్నది
కొడుకు కన్న మనవడే గుండెపై తన్నేది
లాలీ లాలి జో లాలి లొలొ హాయ్
హాయి హాయి జో లాలి లొలొ హాయ్
అసలు మీద లేని మోజు వడ్డీపై ఉన్నది
కొడుకు కన్న మనవడే గుండెపై తన్నేది
పొద్దువాలి పోతుంటే ముద్దు పెరిగి పోతుంది
ముగ్గుబుట్ట సరసానా సిగ్గింకా ఉన్నది
ఒహ్హొహ్హొ..ఓఓ..అహ్హాహ్హా..హాఅ....
చేయి చేయిగా హాయి హాయిగా
చేయి చేయిగా దాంపత్యం
హాయి హాయిగా సంసారం
చేయి చేయిగా దాంపత్యం
హాయి హాయిగా సంసారం
చేసినాములే చూసినాములే
ఒహోహొహొహో..హో.హో
అహహహ్హహహ్హ..హహ
ఆనందం ఆనందం
ఆనందమె జీవిత మకరందం.
ఆనందం ఆనందం
ఒహోహొహొహో..హో.హో
అహహహ్హహహ్హ..హహ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon