చిత్రం : మంచి మనుషులు (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆహ..ఆహ..ఆహా..ఆహ...ఆ..ఆ..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు.. నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో..
ఈ జగమే లేదు..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు.. నువ్వే నేను
నువ్వూ నేను నేను నువ్వు లేనిచో..
ఈ జగమే లేదు..
తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ
పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..
తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ
పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..
తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ..
తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ...
తేనెకు మన ముద్దేలే తీపినిచ్చేదీ..తీపినిచ్చేదీ..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో..
ఈ జగమే లేదు..
నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ..ఈ
నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ..
సృష్టిలోని అణువు అణువులో..
వున్నామిద్దరమూ..ఊ..ఊ
జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ....
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వూ నువ్వూ నేను లేనిచో..
ఈ జగమే లేదు..
కొండల్లే నువ్వున్నావు.. నాకు అండగా..ఆ..
మంచల్లే నువ్వున్నావూ.. నాకు నిండుగా..ఆ..ఆ..
కొండల్లే నువ్వున్నావు.. నాకు అండగా..ఆ..
మంచల్లే నువ్వున్నావూ.. నాకు నిండుగా..ఆ..ఆ..
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..
నిన్నా..నేడు రేపే లేని..ప్రేమ జంటగా..ఆ..ఆ
ప్రేమ జంటగా..ఆ...
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు...
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో..
ఈ జగమే లేదు..
అహ..అహ..హహా..హా.హా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon