చిత్రం : దేవదాసు (1974)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : ఆరుద్ర
గానం : బాలు,సుశీల
పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ
కుదిరితే ఏమితక్కువ
ఈ మదికి ఆ మదికి అడ్డుగోడలేదు
ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ ఉంది
ఈ మదికి ఆ మదికి అడ్డుగోడలేదు
ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ ఉంది
గోడ నడుమ ఒక మూయని తలుపు వుందిలే
ఆ తలుపు వెనుక రారమ్మని పిలుపు వుందిలే
పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ
కుదిరితే ఏమితక్కువ
ఎంత అణచినా మనసు అణగనన్నదీ
ఇంత వలపు ఇపుడిప్పుడే కూడదన్నదీ
ఎంత అణచినా మనసు అణగనన్నదీ
ఇంత వలపు ఇపుడిప్పుడే కూడదన్నదీ
అనురాగం ఆ జన్మకు అధికమైనచో
మన ఇద్దరి ప్రేమకు మరుజన్మ వుందిలే
పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ
కుదిరితే ఏమితక్కువ
చదవేస్తే ఉన్నమతి జారిందేమో
మదినిండా వలపుంటే చదువు ఎందుకూ
చదవేస్తే ఉన్నమతి జారిందేమో
మదినిండా వలపుంటే చదువు ఎందుకూ
దొరవేషం వేసినా దుడుకుతనం పోదా.. ఏయ్
ఇంత ఎదిగిన నీలో పిరికితనం పోదా
పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ
కుదిరితే ఏమితక్కువ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon