చెలీ నీ కోరికా గులాబీ మాలిక పాట లిరిక్స్ | సుగుణసుందరి కథ (1970)

 చిత్రం : సుగుణసుందరి కథ (1970)

సంగీతం : ఎస్.పి. కోదండపాణి

సాహిత్యం : సినారె

గానం : రామకృష్ణ, సుశీల


చెలీ నీ కోరికా గులాబీ మాలిక

చెలీ నీ కోరికా గులాబీ మాలిక

గుబాళించేనిక అదే నా వేడుక

ప్రియా నా కోరికా గుబాళించేనిక

ప్రియా నా కోరికా గుబాళించేనిక 

అదే నీ కానుక ఇదే నా వేడుక


నీల గగనాల జాబిల్లివై

పాల పరువాల సిరిమల్లెవై

నీల గగనాల జాబిల్లివై

పాల పరువాల సిరిమల్లెవై

మిన్ను లందించవే నన్ను అలరించవే

మిన్ను లందించవే నన్ను అలరించవే

ఎన్నో అనురాగ సుమ డోలలూగించవే


ప్రియా నా కోరికా గుబాళించేనిక 

అదే నీ కానుక ఇదే నా వేడుక


నిన్ను విడలేని పదదాసినై

ఎన్నో పుణ్యాల ఫలరాసినై

నిన్ను విడలేని పదదాసినై

ఎన్నో పుణ్యాల ఫలరాసినై

నిన్నే సేవించనా నీవై జీవించనా

నిన్నే సేవించనా నీవై జీవించనా

జీవితానంద తీరాల విహరించనా


చెలీ నీ కోరికా గులాబీ మాలిక

గుబాళించేనిక అదే నా వేడుక

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)