చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : భానుమతి
పిలచిన బిగువటరా.. ఔరౌరా
పిలచినా.. బిగువటరా.. ఔరౌరా
పిలచినా.. బిగువటరా.. ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన..
పిలచినా బిగువటరా.. ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలచినా బిగువటరా..
భళిరా రాజా..
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వనమానగ నిను నే
పిలచినా బిగువటరా...
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వనమానగ నినునే
పిలచినా.. బిగువటరా
గాలుల తేలెడు గాఢపు మమతలు
గాలుల తేలెడు గాఢపు మమతలు
నీలపు మబ్బుల నీడలు కదలెను
అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళులా.. ఆ.. ఆ.. ఆ..
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
అందగాడా ఇటు తొందర చేయగా
పిలచినా.. బిగువటరా ఔరౌరా..
పిలచినా.. బిగువటరా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon