ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా పాట లిరిక్స్ | నిన్నే ఇష్టపడ్డాను (2003)

 


చిత్రం : నిన్నే ఇష్టపడ్డాను (2003)

సంగీతం : ఆర్. పి. పట్నాయక్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : బాలు, చిత్ర


ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా

ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస

వరించే కలలొచ్చి...!!! వరాలే కురిపించి

స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా

ఓ... ఓ... ఓ... ఓ...

ఓ... ఓ... ఓ... ఓ...


సంకోచం చాలు అని ఇంకొంచం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం

అవకాశం చూసుకొని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం

చినుకంత చిన్నతడి వెంటపడి వెల్లువగ మారిందా

అణువణువు తుళ్ళి పడి గుండేసడి ఝల్లు మని మోగిందా

ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా

ఓ... ఓ... ఓ... ఓ...

ఓ... ఓ... ఓ... ఓ...


మోమాటం కప్పుకొని ఏమాట చెప్పనని ఎన్నాళ్ళింకా ఈ మౌనం

జడివానై కమ్ముకొని సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం

ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట

నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట

ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస

ఓ... ఓ... ఓ... ఓ...

ఓ... ఓ... ఓ... ఓ...


ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా

ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస

వరించే కలలొచ్చి...!!! వరాలే కురిపించి

స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా

ఓ... ఆ... ఓ... ఆ... ఓ... ఓ

ఆహా హా... ఓహో హో... ఆహా హా... ఆ... ఆ...

Share This :



sentiment_satisfied Emoticon