చిత్రం : బాహుబలి (2016)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : కార్తీక్, దామిని
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడా నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటాదొరా
వేయి జన్మాల ఆరాటమై
వేచి ఉన్నానే నీ ముందరా
చేయి నీచేతిలో చేరగా
రెక్క విప్పిందె నా తొందర
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
మాయగా నీసోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్ళలో
విచ్చుకున్నావె ఓ మల్లికా
కోడె కౌగిళ్ల పొత్తిళ్ళలో
పురి విప్పింది నాకోరిక
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
కానల్లో నువునేను ఒకమేను కాగా
కోనలో ప్రతికొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదురైనా
మరణం కూడా పరవశమే
సాంతం నేను నీ సొంతం అయ్యాక
చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో
చిందులేసింది సిరివెన్నెల
ప్రేమ ఊరేటి నీకళ్ళలో
రేయి కరిగింది తెలిమంచులా
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడా నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటాదొరా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon