ఓంకార పంజర శుకీం పాట లిరిక్స్ | కనకదుర్గ పూజా మహిమ (1960)

 


చిత్రం : కనకదుర్గ పూజా మహిమ (1960)

సంగీతం : రాజన్-నాగేంద్ర

సాహిత్యం : ??

గానం : మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్


ఓంకార పంజర శుకీం

ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం

ఆగమ విపిన మయూరీం

ఆర్యాం అంతర్విభావయే

గౌరీం... గౌరీం... గౌరీం


జయజయ నమో కనకదుర్గా!

నమో మోక్షమార్గా! శ్రితానీక దక్షా! నిరాగా!

ఘోర దుర్వార దౌర్భగ్య భంగా!

అనంగా విభంగా! మహాచండ శృంగత్తురంగా!

గౌరీ! సదా భక్త క్షేమంకరీ!


జయకరీ! శంకరీ! శ్రీకర వశంకరీ!

వసుధాశుభంకరీ! ఆర్తజన అభయంకరీ!

ఆర్తజన అభయంకరీ!

పాహీ త్రిలోకైక జననీ! భవానీ!

భక్త చింతామణీ! ముక్తి సందాయినీ!

ఆర్త సంచారిణీ! ధూర్త సంహారిణీ!

కాళీ! కల్యాణి! గీర్వాణి! హ్రీంకారిణీ!

అన్నపూర్ణా! అపర్ణాంబ! కాత్యాయనీ!

శ్రీచక్ర సింహాసినీ! శాంభవీ! శాంభవీ!

భ్రమరాంబ! శ్యామలా! యవ్వనీ!

ధగల జ్వాలాముఖీ!

కామాక్షి! మీనాక్షి! ద్రాక్షాయణీ!...


పేరులే వేరుగా! అందరూ నీవెగా!

యీదీను కావగా, రావేల వేగా!

అమ్మ, నీ పాదపద్మాలు నమ్మ,

వెతలు తీరునమ్మా! నుతులు చేయగా,

కొంగు బంగారమమ్మా!...

నా జన్మ కారకులు నీ పూజలను మాని

అపరాధములు చేసిరమ్మా!

పాపులూ, పుణ్యులూ నీ పాపలే గాన,

యీ కోపమింకేలనమ్మా?! కృపజూపవమ్మా!

మనోవాంఛితార్ధమ్మునిమ్మా!

మొరాలించవమ్మా!

పాలించవమ్మా! కనికరించమ్మా!

కనికరించమ్మా! కనకదుర్గమ్మా

Share This :
avatar

Very racy, intensely devotional song/hymn. Thank you so much.

delete 31 October 2023 at 00:30



sentiment_satisfied Emoticon