చిత్రం : కీలుగుఱ్ఱం (1949)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : తాపీ ధర్మారావు
గానం : ఘంటసాల, శ్రీదేవి
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా...
కన్యకు గూర్చితి కళ్యాణ మహా
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
ఏదో పనిపై ఏగే వానికి...
ఏదో పనిపై ఏగే వానికి ..
ఈ విద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివి... హహ...
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
నూతనముగా ఈ లేత మారుతము
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా...
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే ..
వదలిన గానమో... ఏమో
వదలిన గానమో... ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే
సామ గానమే ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే
సామ గానమే ఏమో
సామ గానమే ఏమో...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon