చిత్రం : నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కుమార్ సాను, చిత్ర
ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..
మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ..
వెన్నెలేదో.. వేకువేదో.. నీకు తెలుసా మరి!
నిదురపోయే మదిని గిల్లి.. ఎందుకా అల్లరి!
చందమామ మనకందదని
ముందుగానే అది తెలుసుకుని
చేయి చాచి పిలవద్దు అని
చంటిపాపలకు చెబుతామా!
లేని పోని కలలెందుకని
మేలుకుంటే అవి రావు అని
జన్మలోనే నిదరోకు అని
కంటిపాపలకు చెబుతామా!
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని..
మది మీటుతున్న మధురానుభూతి
మననడిగి చేరుతుందా!
ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..
అందమైన హరివిల్లులతో
వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే
కరిగిపోని దూరం ఉందా!
అంతులేని తన అల్లరితో
అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే
ఆకాశం తెగి పడుతుందా!
మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే
అనుకుంటే తీరిపోదా!
ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..
మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon