కురిసింది వానా నా గుండెలోనా పాట లిరిక్స్ | బుల్లెమ్మ బుల్లోడు (1972)

 చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)

సంగీతం : సత్యం

సాహిత్యం : రాజశ్రీ

గానం : బాలు, సుశీల


కురిసింది వానా.. నా గుండెలోనా

నీ చూపులే జల్లుగా

కురిసింది వానా.. నా గుండెలోనా

నీ చూపులే జల్లుగా

ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు

కురిసింది వానా.. నా గుండెలోనా

నీ చూపులే జల్లుగా


అల్లరి చేసే.. ఆశలు నాలో

పల్లవి పాడేనూ..ఊ..ఊ

తొలకరి వయసు.. గడసరి మనసు

నీ జత కోరేనూ..ఊ..ఊ

అల్లరి చేసే.. ఆశలు నాలో

పల్లవి పాడేను..

చలి గాలి వీచే.. గిలిగింత తోచే


కురిసింది వానా.. నా గుండెలోనా

నీ చూపులే జల్లుగా


ఉరకలు వేసే.. ఊహలు నాలో

గుసగుస లాడేనూ..ఊ..ఊ

కథలను తెలిపే.. కాటుక కనులు

కైపులు రేపేనూ..ఊ..ఊ

ఉరకలు వేసే.. ఊహలు నాలో

గుసగుస లాడేను

బిగువు ఇంకేలా.. దరికి రావేలా


కురిసింది వానా.. నా గుండెలోనా..

నీ చూపులే జల్లుగా


Share This :
avatar

పాటలు సాహిత్యము చాలా బాగున్నాయ్

delete 20 July 2023 at 05:04



sentiment_satisfied Emoticon