ఒకరీకి చేయినిచ్చి ఒకరీకి కాలునిచ్చి

ఒకరీకి చేయినిచ్చి ఒకరీకి కాలునిచ్చి
ఒకరీకి నడుమునిచ్చి కూకున్నానోయ్‌ రాజ
ఎవరీకి చేయినిచ్చి ఎవరీకి కాలునిచ్చి
ఎవరీకి నడుమునిచ్చి కూకున్నావ్‌ పిల్ల
కూకున్నావే పిల్లా
గాజుల్కి చేతులిచ్చి కడియాల్కి కాళ్లనిచ్చి
వడ్డాణాన్కి నడుమునిచ్చి కూకున్నానోయి

ఒకనీని లోపల బెట్టి ఒక్కణ్ణి బయటపెట్టి
ఒకనీని పట్టుకోని కూర్చుంటినోయ్‌ బావ
ఎవనీని లోపలబెట్టి ఎవనీని బయటపెట్టి
ఎవనీని పట్టుకొని కూర్చుంటివే పిల్ల.
కాటుక లోపలబెట్టి బొట్టయిన బయటబెట్టి
అద్దము పట్టుకొని కూర్చున్నానోయ్‌ బావ.

ఒకనీని నొక్కిపట్టి ఒకనీని చుట్టబెట్టి
ఒకడికోసము యెదురు చూస్తున్నానోయ్‌ బావ
ఎవడీని నొక్కిపట్టి ఎవడీని చుట్టబెట్టి
ఎవడీ కోసము యెదురుచూస్తున్నావే పిల్ల
వక్కైన నొక్కిపట్టి ఆకైన చుట్టబెట్టి
సున్నం కోసం యెదురు చూస్తున్నానోయ్‌.
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)