కోలు కోలన కోలుకోలే ఓ చెలియా
కొమ్మ మన మిద్దరము జోడే
కోసేది కొయగూర మట్ట నాసామి
వాసనకు దవనాపుకట్ట
వచ్చిపోయే దోవలోన చినదాన
వంతకారి బొమ్మలాట
వీధిలో విస్తారమమ్మా ఈవూరి
కోలాట లెంతేడు కమ్మ
కోలాట లేసేటి కోరికేనైనా
తప్పక తగలాక విడువనో కొమ్మ
వగల గుమ్మడికాయకూర నాసామి
రేతిరిచేసిన చేత
రేతిరిచేసిన చేత చినదాన
మొగనాలితో పొందు రోత
కాగితి కలు బావినీలు నాసామి
కడవనిండా ముంచుకోని
రెండు చేతులు కడవమీద చినదాన
వాలుకన్నులు దానిమీద
కలికి గోపాలుడె కొమ్మా నాసామి
కనులకు వలలొడ్డె నమ్మా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon