ఓ ఓహో చారుశీలా పాట లిరిక్స్ | గుణసుందరికథ(1949)

 చిత్రం : గుణసుందరికథ(1949)

సంగీతం : ఓగిరాల రామచంద్రరావు

సాహిత్యం : పింగళి

గానం : వి.శివరాం


ఓ..ఓహో.. చారుశీలా.. 

లేజవరాలా.. సొగసుభళా.. 

ఓ రూపబాలా.. చిందెను 

వలపు పులక లొలక బిర బిర.. 

కన్నుల్లో విందె అయి 

వెన్నెల్లో వసంతమై

కన్నుల్లో విందె అయి 

వెన్నెల్లో వసంతమై

చిన్నీ నీ హొయల్ గుబుల్ 

గుభాళించె నాహా జోహారులే..

చెంగావి చీర భళిలో.. రంగారే నీ అంగ భంగి

రంగేళీ పంట ఇంపుల్ సొంపుల్ జంపాలాడే.. 

లల్లల్లలాలలా.. లల్లల్లలాలలా.. 

లల్లలాలా లల్లల్లలాలా

లల్లల్లలాలలా.. లల్లల్లలాలలా.. 

లల్లలాలా లల్లల్ల


కుశాల్ బోణీ రసిక రమణి 

కుశాల్ బోణీ రసిక రమణి  

వగల్ చిమ్మీ వరించీ ఓహో.. ఓఓఓ..

ఓహో.. ఓఓఓ.. ఓహో.. ఓఓఓ..

నా మెళ్ళో దండై తల్లో పువ్వై నెగడే 

ముల్లోకాలేలే కేళిది 

ముల్లోకాలేలే కేళిది 

రావేలా బాలా బేలా నన్నో... ఓఓఓ...

Share This :



sentiment_satisfied Emoticon