ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా పాట లిరిక్స్ | శశిరేఖాపరిణయం (2008)

 చిత్రం : శశిరేఖాపరిణయం (2008)

సంగీతం : మణిశర్మ, విద్యాసాగర్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : రాహుల్ నంబియార్


ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా

సరే .. చాలు అనదు కంటి కామనా

ఎదో .. గుండెలోన కొంటె భావనా

అలా .. ఉండిపోక పైకి తేలునా


కనులను ముంచిన కాంతివో

కలలను పెంచిన భ్రాంతివో

కలవనిపించిన కాంతవో .. ఓ ఓ ఓ

మతి మరపించిన మాయవో

మది మురిపించిన హాయివో

నిదురను తుంచిన రేయివో .. ఓ ఓ ఓ


ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా

సరే .. చాలు అనదు కంటి కామనా

ఎదో .. గుండెలోన కొంటె భావనా

అలా .. ఉండిపోక పైకి తేలునా


శుభలేఖలా .. నీ కళా .. స్వాగతిస్తుందో

శశిరేఖలా .. సొగసెటో .. లాగుతూ ఉందో

తీగలా .. అల్లగా .. చేరుకోనుందో

జింకలా .. అందకా .. జారిపోనుందో

మనసున తుంచిన కోరికా

పెదవుల అంచును దాటకా

అదుముతు ఉంచకె అంతగా .. ఓ ఓ ఓ

అనుమతినివ్వని ఆంక్షగా

నిలబడనివ్వని కాంక్షగా

తికమక పెట్టకె ఇంతగా .. ఓ ఓ ఓ


ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా

సరే .. చాలు అనదు కంటి కామనా


మగపుట్టుకే .. చేరనీ .. మొగలి జడలోనా

మరుజన్మగా .. మారనీ .. మగువ మెడలోనా హో

దీపమై .. వెలగనీ .. తరుణి తిలకానా

పాపనై .. ఒదగనీ .. పడతి ఒడిలోనా

నా తలపులు తన పసుపుగా

నా వలపులు పారాణిగా

నడిపించిన పూదారిగా .. ఓ ఓ ఓ

ప్రణయము విలువే కొత్తగా

పెనిమిటి వరసే కట్టగా

బతకన నేనే తానుగా .. ఓ ఓ ఓ


ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా

సరే .. చాలు అనదు కంటి కామనా


Share This :



sentiment_satisfied Emoticon