నిను వినా నాకెవ్వరూ పాట లిరిక్స్ | దేవుడు చేసిన బొమ్మలు (1976)

 చిత్రం : దేవుడు చేసిన బొమ్మలు (1976)

సంగీతం : సత్యం

సాహిత్యం : ఆత్రేయ

గానం : బాలు, జానకి 


నిను వినా నాకెవ్వరూ..

నా ఆరాధనలు నీకొరకే

నిను వినా నాకెవ్వరూ..

నా ఆరాధనలు నీకొరకే

నిను వినా నాకెవ్వరూ..


కొలచినవారే కొరతలు బాపీ..

కోరిక తీర్చే దైవమునీవే

నిత్యము నిన్నే సేవించినచో..

నా కలలన్నీ సఫలము కావా

కలిమి బలిమి..నీ కరుణే..

 

నిను వినా నాకెవ్వరూ..

నా ఆరాధనలు నీకొరకే

నిను వినా నాకెవ్వరూ...


మోహనరూపం మురళీగానం..

నీ శుభనామం తారకమంత్రం

నీ కడగంటీ చూపులె చాలు..

తనువూ మనసూ పులకించేనూ

జపము తపము..నీకొరకే

 

నిను వినా నాకెవ్వరూ

నా ఆరాధనలు నీకొరకే

నిను వినా నాకెవ్వరూ


కన్నుల ఎదుటా కనపడు దైవం..

కరుణించుటయే స్త్రీసౌభాగ్యం

ఆరనిజ్యోతీ అమృతమూర్తీ..

దీవెనకాదా సుఖసంసారం

ఇల్లేస్వర్గం ఈ ఇలలో..

 

నిను వినా నాకెవ్వరూ..

నా ఆరాధనలు నీకొరకే

నిను వినా నాకెవ్వరూ..

నా ఆరాధనలు నీకొరకే

నిను వినా నాకెవ్వరూ..


Share This :



sentiment_satisfied Emoticon