చీరకు రవికందమా పాట లిరిక్స్ | అత్తలూ కోడళ్లు (1971)

 చిత్రం : అత్తలూ కోడళ్లు (1971)

సంగీతం : కె. వి. మహదేవన్

సాహిత్యం : ఆత్రేయ

గానం : బాలు, సుశీల


చీరకు రవికందమా?...  రవికకు చీరందమా ?

చీరకు రవికందమా?... రవికకు చీరందమా ?

చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా


చీరకు రవికందమా?.. రవికకు చీరందమా ?

చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా


పైటకొంగు చుట్ట చుట్టి పైటన్నం గంపనెట్టి

పైటకొంగు చుట్టచుట్టి పైటన్నం గంపనెట్టి

కోక కాస్త ఎత్తికట్టి గట్టుమీద నడుస్తుంటె

కోక కాస్త ఎత్తికట్టి గట్టుమీద నడుస్తుంటె


నడక అందమా ? ఆ నడుము అందమా ?

నడక అందమా ? ఆ నడుము అందమా ?


చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?

చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా

చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా


పైరగాలి వీస్తుంటే.. పంటచేలు వూగుతుంటే

పైరగాలి వీస్తుంటే, పంటచేలు వూగుతుంటే

ముందు ముందు పంట తలచి మురిసిపోతు నువ్వుంటే

ముందు ముందు పంట తలచి మురిసిపోతు నువ్వుంటే


నువ్వు అందమా? నీ గర్వమందమా?

నువ్వు అందమా ? నీ గర్వమందమా ?


చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?

చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా


ముద్ద నేను పెడుతుంటే  నా మొగం నువ్వు చూస్తుంటే

ముద్ద నేను పెడుతుంటే  నా మొగం నువ్వు చూస్తుంటే

ముద్ద ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే

ముద్ద ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే


కోరికందమా? .. నీ కోపమందమా ?

నా కోరికందమా? .. నీ కోపమందమా ?

చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?

చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా

చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా

 చీరకు రవికందమా? .. రవికకు చీరందమా ?

చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా 

Share This :



sentiment_satisfied Emoticon