నీవు లేక వీణ పలుక లేనన్నది పాట లిరిక్స్ | డాక్టర్ చక్రవర్తి (1964)

 చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : సుశీల


నీవు లేక వీణ పలుక లేనన్నది

నీవు రాక రాధ నిలువ లేనన్నది..ఆ..


జాజి పూలు నీకై.. రోజు రోజు పూచె

చూచి చూచి పాపం.. సొమ్మసిల్లిపోయే

చందమామ నీకై.. తొంగి తొంగి చూచి

చందమామ నీకై తొంగి తొంగి చూచి..

సరసన లేవని అలుకలుబోయె


నీవు లేక వీణ

 

కలలనైన నిన్ను.. కనుల చూతమన్న

నిదుర రాని నాకు.. కలలు కూడా రా..వే

కదలలేని కాలం.. విరహ గీతి రీతి

కదలలేని కాలం విరహ గీతి రీతి..

పరువము వృధగా బరువుగ సాగే


నీవు లేక వీణ

 

తలపులన్ని నీకై.. తెరచి వుంచినాను

తలపులెన్నో మదిలో.. దాచి వేచినాను

తాపమింక నేను.. ఓపలేను స్వామి

తాపమింక నేను ఓపలేను స్వామి..

తరుణిని.. కరుణను.. యేలగ రావా...

 

నీవు లేక వీణ పలుక లేనన్నది

నీవు రాక రాధ నిలువ లేనన్నది..ఆ..

నీవు లేక వీణా..ఆ..

Share This :



sentiment_satisfied Emoticon