చిత్రం : పూల రంగడు (1967)
సంగీతం : ఎస్ రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల
ఆఆ...ఆఆఅ...ఆఆఆ...
నీవు రావు.. నిదుర రాదు..
నీవు రావు నిదుర రాదు
నిలిచి పోయె ఈ రేయి
నీవు రావు నిదుర రాదు
తారా జాబిలి ఒకటై సరస మాడే ఆరేయి
తారా జాబిలి ఒకటై సరస మాడే ఆరేయి
చింత చీకటి వొకటై చిన్నబోయె ఈ రేయి
నీవు రావు..
నీవు రావు నిదుర రాదు
నిలిచి పోయె ఈ రేయి
నీవు రావు నిదుర రాదు
ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె
కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
ఎదురు చూసి ఎదురు చూసి
ఎదురు చూసి ఎదురు చూసి
కన్నుదోయి అలసిపోయె
నీవు రావు..
నీవు రావు నిదుర రాదు
నిలిచి పోయె ఈ రేయి
నీవు రావు నిదుర రాదు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon