చిత్రం : అఖండుడు (1970)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : దాశరధి
గానం : పి.బి.శ్రీనివాస్, సుశీల
రారా రమ్మంటే రావేల
నీకింత బెదురేలా
ఒంటరిగా ఉన్నారా..
రారా రమ్మంటే రావేల
నీకింత బెదురేలా
ఒంటరిగా ఉన్నారా..
నను కాపాడిన చేతులలోనే
వాలెదనంటే ఈ బిగువేలా
నను కాపాడిన చేతులలోనే
వాలెదనంటే ఈ బిగువేలా
మగువే తానే వలచిన వేళా
మగవారి బింకాలన్నీ ఇంతేనా
రా రా రమ్మంటే రావాలా
పొమ్మంటే పోవాలా
నీ మాటే సాగాలా.
పలుకులతోనే వలపులు కురిసీ
చూపులలోనే కోపం మెరిసే
పలుకులతోనే వలపులు కురిసీ
చూపులలోనే కోపం మెరిసే
నిలకడలేని చెలియల తీరు
దివినుండే దేవునికైనా తెలియదులే
రా రా రమ్మంటే రావాలా
పొమ్మంటే పోవాలా
నీ మాటే సాగాలా.
యవ్వనమంతా దోసిట నింపి
జీవితమే ఒక కానుక జేసి
యవ్వనమంతా దోసిట నింపి
జీవితమే ఒక కానుక జేసి
నీవే నీవే నా సర్వమనీ
నీకోసం వేచితినోయీ రావోయీ
రారా రమ్మంటే రావేల
నీకింత బెదురేలా
ఒంటరిగా ఉన్నారా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon