నను పాలింపగ నడచి వచ్చితివా. పాట లిరిక్స్ | బుద్ధిమంతుడు (1969)

 


చిత్రం : బుద్ధిమంతుడు (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : దాశరధి

గానం : ఘంటసాల


వేయి వేణువులు మ్రోగేవేళా... ఆ... ఆ...

హాయి వెల్లువై పొంగేవేళా...

రాస కేళిలో తేలే వేళా...

రాధమ్మను లాలించే వేళ....


నను పాలింపగ నడచి వచ్చితివా..

మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా

నను పాలింపగ నడచి వచ్చితివా...

మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా


నను పాలింపగ నడచి వచ్చితివా.. ఆ హా హా...


అర చెదరిన తిలకముతో.. అల్లదిగో రాధమ్మా..

అర జారిన పైయ్యెదతో.. అదిగదిగో గోపెమ్మా..

ఎరుపెక్కిన కన్నులతో.. ఇదిగిదిగో సత్యభామా..

పొద పొదలో.. యెద యెదలో.. 

నీ కొరకై వెదకుచుండగా


నను పాలింపగ నడచి వచ్చితివా

మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా

నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...


కంసుని చెరసాలలో.. ఖైదీవై పుట్టావు

కాంతల కౌగిళ్ళలో.. ఖైదీవై పెరిగావు

కరకురాతి గుళ్ళలో.. ఖైదీవై నిలిచావు

ఈ భక్తుని గుండెలో.. ఖైదీగా.. ఉండాలనీ


నను పాలింపగ నడచి వచ్చితివా

మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా

నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...

Share This :



sentiment_satisfied Emoticon