చిత్రం : మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఎస్. వరలక్ష్మి
లీలా కృష్ణా నీ లీలలు
నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ
నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ
లీలా కృష్ణా నీ లీలలు
నే లీలగనైనా తెలియనుగా
వేణు గానమున తేరగ పిలిచి ..
మౌనము పూనగ ఏలనో
వేణు గానమున తేరగ పిలిచి ..
మౌనము పూనగ ఏలనో
అలకయేమో యని దరి రాకుండిన
జాలిగ చూచే వేలనో...
లీలా కృష్ణా నీ లీలలు
నే లీలగనైనా తెలియనుగా
నీ చిరునవ్వుల వెన్నెలలో
మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో
మైమరువగ చేయగ ఏలనో
మైమరచిన చెలి మాటే లేదని..
ఆ ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..
మైమరచిన చెలి మాటే లేదని..
ఓరగ చూచే వేలనో...
లీలా కృష్ణా నీ లీలలు
నే లీలగనైనా తెలియనుగా
తెలిసీ తెలియని బేలల కడ
నీ జాలములేవి చెల్లవుగా..
లీలా కృష్ణా నీ లీలలు
నే లీలగనైనా తెలియను గా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon