నా హృదయం తెల్లకాగితం పాట లిరిక్స్ | ప్రేమతరంగాలు (1980)

 చిత్రం : ప్రేమతరంగాలు (1980)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : ఆత్రేయ

గానం : బాలు, సుశీల


నా హృదయం తెల్లకాగితం

అది ఏనాడో నీకు అంకితం.

నా హృదయం తెల్లకాగితం

అది ఏనాడో నీకు అంకితం.

బేషరతుగా ఇచ్చేశా ప్రేమ పత్రమూ..

ఏమైనా రాసుకో నీ ఇష్టమూ..

నా హృదయం తెల్లకాగితం

అది ఏనాడో నీకు అంకితం.


మెరుపై మెరిశావు చినుకై కురిశావు

చిగురులు వేశావు నాలో..

చల్లగా వచ్చావు వెచ్చగా మారావు

పచ్చగా మిగిలావు నాలో..

అల చిన్నారివి ఇక వయ్యారివి

ఆ నెయ్యానివి ఇక వియ్యానివి

ఆ కలుసుకున్నాము నేడు

మన కథ రాసుకున్నాము రేపు


నా హృదయం తెల్లకాగితం

అది ఏనాడో నీకు అంకితం.

బేషరతుగా ఇచ్చేశా ప్రేమ పత్రమూ..

ఏమైనా రాసుకో నీ ఇష్టమూ..

నా హృదయం తెల్లకాగితం

అది ఏనాడో నీకు అంకితం.

 

పూచిన జాబిల్లి పున్నమి సిరిమల్లి 

నాకిక నెచ్చెలివి నీవే.. 

పొంగే గోదారి పూవుల రాదారి 

నాకిక సహచారివి నీవే..

నా కలవాణివి ఇక కళ్యాణివి 

అల నెలరాజువి ఇక నా రాజువీ 

ఆఆ కలసి పోయాము మనమూ 

ఇక కలబోసుకుందాము సుఖమూ..


నా హృదయం తెల్లకాగితం

అది ఏనాడో నీకు అంకితం.

బేషరతుగా ఇచ్చేశా ప్రేమ పత్రమూ..

ఏమైనా రాసుకో నీ ఇష్టమూ..

నా హృదయం తెల్లకాగితం

అది ఏనాడో నీకు అంకితం.


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)