కో అంటె కోయిలమ్మ పాట లిరిక్స్ | తూర్పు వెళ్ళే రైలు (1979)

 చిత్రం : తూర్పు వెళ్ళే రైలు (1979)

సంగీతం : బాలు

సాహిత్యం : ఆరుద్ర

గానం : బాలు


కో అంటె కోయిలమ్మ కోకో.. 

కో అంటె కోడిపుంజు కొక్కరకో

కో అంటె కోయిలమ్మ కోకో.. 

కో అంటె కోడిపుంజు కొక్కరకో

కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో

నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో..

కో కాసుకో...


కో అంటే కోయిలమ్మ కోకో.. 

కో అంటె కోడిపుంజు కొక్కరకో


కోటేరు పట్టినోడికో.. పూట కూడు దక్కదెందుకో

నారు నీరు పోసినోడుకో.. శేరు గింజలుండవెందుకో

అన్నం ఉండదొకడికి తిన్నదరగదొకడికి

ఆశ చావదొకడికి ఆకలారదొకడికీ


కో కాసుకో...

కో అంటే కోయిలమ్మ కోకో.. 

కో అంటె కోడిపుంజు కొక్కరకో


మేడిపండు మేలిమెందుకో.. 

పొట్ట ఇప్పి గుట్టు తెలుసుకో

చీమలల్లే కూడబెట్టుకో.. 

పాములొస్తే కర్రపట్టుకో కో..

పాములొస్తే కర్రపట్టుకో కో..ఒ..ఒ..

కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో

కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో

వేమన్న వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో కాసుకో


కో అంటే కోయిలమ్మ కోకో 

కో అంటె కోడిపుంజు కొక్కరకో


తూరుపింటి ఆంకాళమ్మ కో... కో ...

పడమటింటి పోలేరమ్మ కొక్కో...

దక్షిణాన గంగానమ్మ కో.. కో ..

ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో

కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా

పంట చేను కాపలాకు నేను ఎందుకో .. కో... కాసుకో ...


కో అంటే కోయిలమ్మ కోకో.. 

కో అంటె కోడిపుంజు కొక్కరకో

కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో

నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో.. 

Share This :



sentiment_satisfied Emoticon